Home Page SliderTelangana

మెదక్ ఎంపీగా నీలం మధు గెలుపు లాంఛనమేనా? గ్రౌండ్ రిపోర్ట్

Share with

మెదక్ లోక్ సభ నియోజకవర్గం హైదరాబాద్ భాగ్యనగరానికి కూతవేటు దూరంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చేరువలో ఉంది. ఇక్కడ్నుంచి ఎన్నికల్లో బీసీల బిడ్డ నీలం మధు ముదిరాజ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. పాతికేళ్ల తర్వాత మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు స్థానికులు. బరిలో నీలం మధు దిగడంతో సీన్ మారిపోతోంది. మొన్నటి వరకు గెలుపుపై దీమాగా ఉన్న నేతలకు నోట్ల పచ్చి వెలక్కాయపడ్డట్టయ్యింది. మెదక్ కాస్మోపోలిటన్ కల్చర్ ఇప్పుడు ఎవరిని విజయతీరాలకు చేర్చుతుందన్నదానిపై గందరగోళం ఉంది. కానీ ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటేయాలన్నదానిపై ఒక క్లారిటీతో ఉన్నట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక గజ్వేల్, ఏడు నియోజవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికీ, మెజార్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు హోరాహోరీ ఫైట్ ఇచ్చారు. దుబ్బాక, గజ్వేల్ మినహా ఐదు సెగ్మెంట్లోలనూ బీఆర్ఎస్ పార్టీకి నిజమైన ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నేతలు నిలిచారు. దీంతో ఈసారి మెదక్ ఎంపీగా విజయం సాధించేందుకు తగిన వాతావరణం ఏర్పడినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మెదక్ ఎంపీ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీతో తలపడితే, బీజేపీ అడ్రస్ గల్లంతయ్యింది. అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీని ఓడించినంత పనిచేసింది హస్తం పార్టీ. సిద్ధిపేటలో కాంగ్రెస్ అభ్యర్థికి 23206 ఓట్లు రాగా, మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ విజయం సాధించాడు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గట్టి ఫైట్ ఇచ్చి కేవలం 8 వేల ఓట్లతో ఓడాడు. సంగారెడ్డిలోనూ జగ్గారెడ్డి కేవలం 8 వేల ఓట్లతో ఓటమి పాలయ్యాడు. పఠాన్ చెరులోనూ కాంగ్రెస్ కేవలం 7 వేల ఓట్లతో ఓటమి పాలయ్యింది. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. గజ్వేల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీకి 32 వేలకు పైగా ఓట్లు వచ్చాయ్. మొత్తంగా మెదక్ నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యేనే గెలిచినప్పటికీ అన్ని కీలక ఓట్లను పార్టీ రాబట్టడం కూడా ఇప్పుడు ఎంపీ గెలుపునకు సహకరిస్తాయన్న విశ్లేషణలున్నాయి. అందుకే మెదక్ ఎంపీగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా అన్న ఇంప్రషన్ ఉంది. ఇప్పటికే తెలంగాణలో 12 లోక్ సభ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయమన్న విశ్లేషణలున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి పాలన, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేకనన్న భావన ఉంది. దీనికి తోడు నియోజకవర్గంలో 70 శాతానికి పైగా ఉన్న బహుజనులు, ఈ సారి మదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నీలం మధును గెలిపించుకుతీరతామంటున్నారు. ఇన్నాళ్లూ ఏదో పార్టీకి అవకాశమిచ్చామని, ఈసారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఓటేద్దామని వారందరూ తేల్చి చెబుతున్నారు. అంతే కాదు ఎన్నికల్లో విజయం కోసం నీలం మధు వ్యూహాలు వర్కౌటవుతాయని.. ఒక సర్పంచ్ గా ఉన్న సామాన్యుడు ఇప్పుడు ఎంపీగా బరిలో దిగి.. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాడని నియోజకవర్గ ప్రజలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అందుకే ఈసారి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుందాం…