బీజేపీలోకి సినీ నటి మాండ్య ఎంపీ సుమలత అంబరీష్
కర్ణాటకలో బీజేపీ, జేడీ(ఎస్) కూటమికి మద్దతుగా తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోవడం లేదన్నారు స్వతంత్ర ఎంపీ, సినీ నటి సుమలత అంబరీష్. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలకు ఆమె ఫుల్ స్టాప్ పలికారు. బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు. మండ్యలో జరిగిన మద్దతుదారుల సమావేశంలో సుమలత బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరు పర్యటన సందర్భంగా తనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాజీ సీఎం, జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామికి మద్దతివ్వాల్సిందిగా కోరారు. బీజేపీ, జేడీ(ఎస్) కూటమి తరపున ప్రత్యేకించి దక్షిణ కర్ణాటక ప్రాంతానికి బలమైన సంకేతాలను పంపేందుకు మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి కుమారస్వామిని ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దింపారు.
