న్యూక్ సబ్‌మెరైన్ INS అరిహంత్ నుండి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన భారత్
భారతదేశం వ్యూహాత్మక జలాంతర్గామి INS అరిహంత్ శుక్రవారం బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షిపణిని ముందుగా నిర్ణయించిన పరిధికి పరీక్షించామని… బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని అనుకున్నట్టుగా వందుకు వంద శాతం ఛేదించిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. “ఐఎన్‌ఎస్ అరిహంత్ ద్వారా SLBM సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణి విజయవంతమైంది. అణు శిక్షణ సామర్థ్యాన్ని నిరూపించడానికి, భారతదేశ అణు సామర్థ్యాన్ని ప్రదర్శించడంలోSSBN ప్రోగ్రామ్ అత్యంత కీలకమైనదని రక్షణ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. దేశ రక్షణ కోసం మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగించాలని మొదట్నుంచి ఇండియా భావిస్తోంది. అణ్వస్త్ర నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. మొదటగా ఎవరిపైనా అణ్వాయుధాలతో దాడి చేయబోమని ప్రకటనలో తెలిపింది.
