భక్తులను తొక్కి చంపిన ఏనుగులు..మృతులకు డిప్యూటీ సీఎం పరిహారం
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగులు భీభత్సం సృషించాయి. శివరాత్రి రాబోతున్న సందర్భంగా గుండాల కోనలోని శివాలయానికి దర్శనానికి బయలుదేరిన భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో 4గురు భక్తులను దారుణంగా తొక్కి చంపాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా ఉంది. అడవి దాటి వచ్చి ఊర్లలోని పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడులలో జనాలు, వివిధ కారణాలతో ఏనుగులు కూడా మరణిస్తున్నాయి. దీనికి పరిష్కారం చేయాలని అక్కడి గ్రామాలలోని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు.

