NationalNewsNews Alert

హేమంత్ సోరెన్‌ స్నేహితుని ఇంట్లో అక్రమ ఆయుధాలు

సీబీఐ దాడుల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మైనింగ్, మనీల్యాండరింగ్ కేసులకు సంబంధించి జార్ఖండ్‌తోపాటు పలు ప్రాంతాల్లో ‌ఈడీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్నివాసంలో రెండు ఏకే 47 రైఫిల్స్‌ ను అధికారులు గుర్తించారు. అద్దెకు తీసుకున్న ఓ ఇంట్లోని అల్మారాలో వీటిని రహస్యంగా దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. మరో 16 ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జరిపారు. జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీలో దాడులు నిర్వహించారు. ఆయుధాల గుర్తింపు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయనున్నామని, ఆయుధ చట్టాల ప్రేమ్ ప్రకాశ్‌పై ప్రత్యేక కేసు నమోదు చేయనున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు.