NewsTelangana

అప్పుడే పోయేవాడిని..

అమ్ముడుపోయే వాడినే అయితే.. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పోయినప్పుడే పార్టీ ఫిరాయించేవాడిని కదా.. అని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. చండూరు మండలం సిర్దపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్‌కే కోట్లాది రూపాయలు ఇచ్చానని.. ఆ దుర్మార్గ కేసీఆర్‌ మీ కాళ్ల వద్దకు వచ్చేందుకే రాజీనామా చేశానని.. ఇప్పుడు కేసీఆర్‌కు ఆ పరిస్థితి వచ్చిందా.. లేదా.. అని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి మిమ్మల్ని బతిమాలుకుంటున్నారని చెప్పారు. ధర్మాన్ని కాపాడాలని.. ధర్మం మిమ్ములను కాపాడుతుందని స్పష్టం చేశారు.