‘నాకీ రాజకీయాలు వద్దు బాబోయ్’..పోసాని
ఇకపై తాను రాజకీయాల జోలికి వెళ్లనని, రాజకీయాల పేరెత్తనని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అంటున్నారు. తాను కేవలం ఒక ఓటరుగా మాత్రమే మాట్లాడానని, తన అభిప్రాయాలు మాత్రమే చెప్పానని దీని వల్ల తనపై కేసులు పెట్టారని ఆయన బాధను వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో టీడీపీ పార్టీపై, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారని ఆయనపై టీడీపీ, జనసేన కార్యకర్తలు కేసు పెట్టారు. ఈ విషయంగా ఆయన ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ను కూడా విమర్శించానని, కానీ తెలంగాణ వారు తనపై కేసులు పెట్టలేదని పేర్కొన్నారు. ఏపీలో మాత్రమే ఇలాంటి సంస్కృతి చూస్తున్నానని ఆయన బాధను వ్యక్తం చేశారు.