Home Page SliderLifestyleNationalTrending Todayviral

భార్య చేసిన పనికి భర్త ఉద్యోగానికి ఎసరు

చండీగఢ్‌లో ఒక పోలీసు కానిస్టేబుల్ భార్య చేసిన పని అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది. చండీగఢ్‌ సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్ రోడ్డుపై జ్యోతి అనే మహిళకు సంబంధించిన డ్యాన్స్ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఆమె భర్త అజయ్ కుందు సెక్టార్ 19లో సీనియర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.  అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఆ వీడియోను పోస్టు చేయడంతో అతనిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. ఆమె ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిందని, ప్రజా భద్రతకు ముప్పు వంటి కారణాల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె తన వదినతో కలిసి ఒక దేవాలయానికి వెళ్లి వస్తూ ఈ డ్యాన్స్ చేసి, ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్డుపై  ఒక పంజాబీ పాటకు నృత్యం చేశారు. దీనిని వీడియో చిత్రీకరించి తన భర్త ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పోస్ట్ చేయడంతో ఇంత అల్లరి జరిగింది.