home page sliderTelangana

బాబోయ్ ఎండలు.. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు..

ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ… ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, నిజామా బాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో 21 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆదిలాబాద్ లో గరిష్టంగా 44.6 డిగ్రీల పైన, కనిష్టంగా హైదరాబాద్ లో 40.1 డిగ్రీలు నమోదు కావచ్చని హెచ్చరించింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో రాత్రిపూట వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వడగండ్ల వర్షాలకు అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది.