చీరాలలో ఉద్రిక్తత, మళ్లీ రాజుకున్న అగ్గి
చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆమంచి కారు, కరణం వెంకటేష్ కారు ఎదురెదురుపడటంతో గందరగోళం నెలకొంది. ఇరు వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇరువురు కార్లపై రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆమంచి కారు అద్దాలు ధ్వంసమమయ్యాయి.

