Home Page SlidermoviesNews AlertTelanganaVideosviral

చిరు కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్..

మెగాస్టార్ చిరంజీవి, ఫన్నీ క్రియేటివ్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మెగా 157 చిత్రంలో నటించేందుకు నయనతార వచ్చేసిందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి షార్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కూడా అతిథి పాత్రలో నటించనున్నారని టాక్. జూన్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ‘సంక్రాంతికి రఫ్పాడించేద్దాం..’ అంటూ అనిల్ రావిపూడి, నయనతార కలిసి వీడియోలో ఫోజులిచ్చారు. దీనితో ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోందని తెలుస్తోంది.