NewsTelangana

హీరో మహేష్‌బాబుకు మాతృవియోగం

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో మృతి చెందారు. ఇందిరాదేవి మృతితో టాలీవుడ్ ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ-ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబుతోపాటు, పద్మావతి, మంజుల, ప్రియదర్శినీ ఉన్నారు. ఇటీవలే కృష్ణ తనయుడు రమేష్ బాబు అనారోగ్యంతో చనిపోయారు. ఇందిరాదేవి పార్థివదేహాన్ని 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచుతారు. సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుపుతారు.