NewsTelangana

తెలంగాణాలో వరుణుని విలయతాండవం

Share with

దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాలకు ఆనుకుని, వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దీంతో నగర తీరంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో నదులు పోటెత్తుతున్నాయి. ప్రభుత్వం ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు చర్యలు తీసుకుంటోంది. రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 8 జిల్లాలకు రెడ్ అలెర్డ్ జారీ చేసింది. తాజాగా హైదరాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ.

భారీ వర్షాల కారణంగా నగరంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఓయూ పరిధిలో ఇప్పటి వరకు జరుగుతున్న, జూలై 11న జరగనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సీఎం కేసీఆర్‌ విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినందున ఓయూలో జరగనున్న వివిధ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలతో పాటు పీజీ ఇంటర్నల్‌ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరిగి పరీక్షలను నిర్వహించనున్న తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. కొమరంభీమ్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రేపు ఉదయం వరకు అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరుసగా నాలుగోరోజు కుండపోత వానలు కురిశాయి. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కుంభవృష్ఠి కురుస్తోంది.

రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 8 జిల్లాలకు రెడ్ అలెర్డ్ జారీ చేసింది. తాజాగా హైదరాబాద్ జిల్లాకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది ఐఎండీ. దీంతో నగరంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఓయూ పరిధిలో ఇప్పటి వరకు జరుగుతున్న, జూలై 11న జరగనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సీఎం కేసీఆర్‌ విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినందున ఓయూలో జరగనున్న వివిధ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలతో పాటు పీజీ ఇంటర్నల్‌ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరిగి పరీక్షలను నిర్వహించనున్న తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.