Home Page SliderTelangana

తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు భారీ వర్షసూచన ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని పలు ప్రాంతాలలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు ఉదయం మంచిర్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, అసిఫాబాద్, వరంగల్,భద్రాద్రి,ములుగు, హనుమకొండ,సిద్దిపేట జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాలలో ఎల్లో అలెర్టు జారీ చేశారు. నిర్మల్, జగిత్యాల, ఖమ్మం,సూర్యాపేట, హైదరాబాదు, సంగారెడ్డి, వికారాబాద్  జిల్లాలలో బలమైన గాలులు వేగంగా వీస్తాయని హెచ్చరికలు చేసింది.