Home Page SliderTelangana

సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ,3 వారాలకు వాయిదా

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. గతంలో నళినీ చిదంబరం పిటిషన్ కు తాజాగా కవిత పిటిషన్ ను సుప్రీం కోర్టు ట్యాగ్ చేసింది. మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ జరిపించే విషయంలో నళినీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కవిత నిందితురాలు కారన్నారు సీనియర్ లాయర్ కపిల్ సిబాల్. కవిత తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. పోలీసులు కేసు విషయంలో ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేశారన్నారు. ఐతే మొత్తం వ్యవహారాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. కేసు విచారణలో ఎన్నో అంశాలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.