కేసీఆర్ తో హరీష్ భేటీ.. నోటీసులపై చర్చ
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. ఇవాళ మాజీ మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ కి వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే నెల 5న విచారణ కు రావాలంటూ కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన విచారణకు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 9న హరీశ్ రావు కూడా విచారణకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో అప్పటి పరిస్థితులు, కమిషన్ అడగబోయే ప్రశ్నలు.. చెప్పాల్సిన సమాధానాలపైనే వీరు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

