Home Page SliderNational

దీనిపై జీఎస్టీ తగ్గింపు..కేంద్రం ప్రకటన

హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల వీటిపై జీఎస్టీని ఎత్తివేయమంటూ డిమాండ్లు వచ్చాయి. లైఫ్ ఇన్సూరెన్సులపై, హెల్త్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో కేంద్రం కాస్త దిగి వచ్చింది. పూర్తిగా రద్దు చేయకున్నా వీటిపై జీఎస్టీని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గిస్తూ రేషనలైజేషన్ కమిటీకి ప్రతిపాదన పంపించింది. ఈ కమిటీ ఈ నెల 22న సమావేశం కానుంది. ఆ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.