మాటలను వ్రాతలుగా మార్చే గూగుల్ ‘ట్రాన్స్‌స్కైబ్’
కరోనా వల్ల చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతిని మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. దీనిలో భాగంగానే స్టాఫ్‌తో మీటింగుల కోసం ‘గూగుల్ మీట్’ను కూడా పెట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఆఫీసులు మొదలైనా కూడా అడపాదడపా గూగుల్ మీట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ గూగుల్ మీట్‌తో అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నాయి. ఇప్పుడు ఈ యాప్ యూజర్లకు కొత్తఫీచర్‌ను పరిచయం చేసింది గూగుల్ మీట్. దీనిద్వారా ఈ కాల్స్ లో జరిగే సంభాషణలను ‘టెక్ట్స్’ గా మార్చుకుని తిరగి దానిని గూగుల్ డాక్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుని, తిరిగి ఉపయోగించుకునే వీలు ఉంది. దీనిని ‘ట్రాన్స్ స్కైబ్’ అనే పేరుతో లాంచ్ చేసింది గూగుల్. దీని ద్వారా గూగుల్ మీట్‌లో వీడియోకాల్ స్టార్ట్ అయ్యాక, కాల్ ‘ట్రాన్స్ స్కైబ్’ అవుతున్నట్లు యూజర్‌కి తెలియజేస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ మీటింగ్‌లో చర్చించిన అంశాలన్నీ రికార్డు అవుతూ ఉంటాయి. కాల్ పూర్తయ్యాక రికార్డు చేసిన ఆడియోను ‘టెక్ట్స్’ గా మార్చి, డ్రైవ్ స్టోరేజ్‌లో ఉన్న ‘మీట్ రికార్డింగ్స్’ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తుంది. దీనిని ఈ మీటింగులో పాల్గొన్న వ్యక్తులందరూ యాక్సెస్ చేయవచ్చు.

ఈ ఫీచర్‌ను అక్టోబరు 24 నుండి గూగుల్ వర్క్ స్పేస్ బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్ ప్రైజ్ ప్లస్, ఎడ్యుకేషన్ ప్లస్, టీచింగ్, లెర్నింగ్ అప్ గ్రేడ్ మొదలైన యూజర్లకు అందుబాటులో వస్తుందని గూగుల్ తెలిపింది. తర్వాత కొద్ది కాలంలో సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ తెలిపింది. యూజర్ల ప్రైవసీ కోసం ఇటీవల ‘పాస్ కీ’ అనే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఇది ప్రస్తుతం డెవలపర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలో యూజర్లందరికీ అందుబాటులోకి వస్తోందని గూగుల్ తెలిపింది.