Andhra PradeshHome Page Slider

ఏపీలో మద్యం బాబులకు గుడ్‌న్యూస్

ఏపీ కేబినెట్ మీటింగ్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మందుబాబులకు గుడ్‌న్యూస్ తెలిపారు. నూతన మద్యం విధానానికి పచ్చజెండా ఊపారు. కేవలం రూ.99 నుండే బ్రాండెడ్ మద్యం అందుబాటులో ఉంటుందని గుడ్‌న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్ మద్యాలకు వీడ్కోలు పలికి నాణ్యమైన బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు. ఈ మద్యం పాలసీని పలు రాష్ట్రాల మద్యం పాలసీలను పరిశీలించి అమలులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మీటింగులో వాలంటీర్ల వ్యవస్థపై కూడా చర్చలు జరిగాయి. వారిపై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని సమాచారం. భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరును నిర్ణయించారు.