NewsTelangana

మునుగోడు బరిలో గద్దర్‌..! ప్రజాశాంతి పార్టీలో చేరిక

ఒకానొక సమయంలో కమ్యూనిస్టు యోధుడిగా, ప్రజా యుద్ధ నౌకగా గుర్తింపు పొందిన ప్రజా గాయకుడు గద్దర్‌ అటు తిరిగి.. ఇటు తిరిగి ప్రజాశాంతి పార్టీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల బరిలో ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ ప్రకటించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దర్‌ను ఆయన అభినందించారు. తుపాకి చేతబట్టి మావోయిస్టు పార్టీలో పని చేసిన గద్దర్‌ తర్వాత విప్లవోద్యమ పాటలతో ప్రజలను అలరించారు. ఇటీవల ఆయన కాంగ్రెస్‌, బీజేపీ సభల్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. నోటు తీసుకోకుండా ఓటు వేయాలని మునుగోడు ప్రజలకు సూచించిన కేఏ పాల్‌.. ఉప ఎన్నికలో గద్దర్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.