Telangana

నాగోల్ ఫ్లై ఓవర్‌ ప్రారంభం

హైదరాబాద్‌ ప్రజలకు గుడ్‌న్యూస్‌. మహానగరంలోని ట్రాఫిక్‌ను చెక్‌ పెట్టేందుకు మరో ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. నాగోల్‌ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ రేపు ప్రారంభించనున్నారు. 6 లైన్ల ఈ రహదారి 990 మీటర్ల పొడవు ఉంటుంది. ఉప్పల్‌, ఎల్బీనగర్‌ మధ్య రద్దీని ఈ ఫ్లై ఓవర్‌ తగ్గించనుంది. ఇప్పటికే ఎల్‌బినగర్‌ జంక్షన్‌ అండర్‌ పాస్‌ నిర్మాణంతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై సాఫీగా ప్రయాణం సాగుతోంది. SRDP లో భాగంగా రూ. 143.58 కోట్లతో తెలంగాణ సర్కార్‌ నిర్మాణం చేపట్టింది.