మాజీ క్రికెటర్ రెస్టారెంట్‌కు భారీ అగ్ని ప్రమాదం
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌కు భారీ అగ్ని ప్ర్రమాదం సంభవించింది. మహారాష్ట్ర, పూణే నగరంలోని లుల్లానగర్ ప్రాంతంలోని భవనం పైఅంతస్థులో ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే.. ఈ భవనం పైఅంతస్థులో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ కూడా ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పెద్ద ఎత్తున ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

