చంద్రబాబుతో సినీ నటుడు రజనీకాంత్ భేటీ
టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రఖ్యాత సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ బేటి అయ్యారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. సూపర్ స్టార్ రజినీకాంత్‌ని చంద్రబాబు ఈ సందర్భంగా సత్కరించారు. అయితే రజనీకాంత్ కేవలం మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది.

