Home Page SliderInternational

కరాచీ విమానాశ్రయం వద్ద పేలుళ్లు, ఇద్దరు చైనీయులు మృతి

పాకిస్థాన్‌ కరాచీ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చైనావాసులు మరణించారు. కనీసం 10 మంది గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆదివారం రాత్రి జరిగిన పేలుడు “ఉగ్రవాద దాడి” అని పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. పాకిస్థాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న చైనీయులపై ఇటీవలి సంవత్సరాలలో దాడులకు పాల్పడిన వేర్పాటువాద బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఈ దాడి “హేయమైన చర్య” అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. “మా చైనీస్ స్నేహితులను రక్షించడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉంది” అని అతను X లో పేర్కొన్నాడు.