ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యం తెలుసా?
కిలో బియ్యం ధర రూ. 15 వేలు ఉంటుందంటే మీరు నమ్ముతారా. అదేంటి కిలో బియ్యానికి అంత రేటా అంటూ ఆశ్చర్యపోతున్నారా. అవును ఇది నిజమే. మార్కెట్లో ఎన్నో బియ్యం రకాలున్నాయి. ప్రస్తుతం సాధారణ సన్న బియ్యం ధర క్వింటాల్ కు రూ.5000-6000 వేలు ఉండొచ్చు. అయితే, అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపనీయులు పండిస్తున్నారు. జపనీస్ కిన్మెమై రైస్ కిలోకు రూ.15వేలు ధర ఉంటుంది. పేటెంట్ పొందిన కిన్మెమై పద్దతిని ఉపయోగించి దీనిని పండిస్తారు. ఈ ప్రీమియం రైస్లో ఉన్నతమైన రుచి, పోషక విలువలు ఉన్నాయి. జపాన్ వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది. దాని విలక్షణమైన ఉత్పత్తి సాంకేతికత రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుంది. ప్రత్యేకమైన లక్షణం నో-రిన్స్ నాణ్యత, అంటే వంట చేయడానికి ముందు కడగడం అవసరం లేదు.

కిన్మెమై వైట్ రైస్ వేరియంట్ సాధారణ వైట్ రైస్ యొక్క రూపాన్ని, జీర్ణశక్తిని మరియు త్వరితగతిన తయారు చేయడాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే.. అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. తేమతో కూడిన అనుగుణ్యతను కలిగి ఉంటుంది. కిన్మెమై బియ్యం తెల్లగానే ఉన్నా బ్రౌన్ రైస్ అందించే అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బియ్యం ఉడికినప్పుడు నీళ్ళను సరిగ్గా పీల్చుకుంటుంది. దీంతో బియ్యంపై నుంచి ననుపుగా మారుతుంది. ఇది చాలా తొందరగా జీర్ణమవుతుంది. సాధారణ బియ్యంతో పోలిస్తే వీటిలో 30% తక్కువ కేలరీలు, 32% తక్కువ చక్కెర ఉంటుంది. షుగర్, బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 1.8 రెట్లు ఎక్కువ ఫైబర్, ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ బి1 అందిస్తుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులను నిర్వహించడంలో సహాయపడుతుంది.
కిన్మెమై బియ్యం సాగు కూడా మనం వాడే సాధారణ బియ్యం లాగే 3 నుంచి 5 నెలల్లో పండుతుంది. కానీ దీన్ని డిఫరెంట్ పద్ధతిలో పండిస్తారు. కంపెనీ విషయానికి వస్తే.. కిన్మెమై రైస్ ఏకైక ఉత్పత్తిదారు అయిన టోయో రైస్ కార్పోరేషన్ 1961 లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం వాకాయమాలో ఉంది. కిన్మెమై ప్రీమియం బియ్యం అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డ్ లో స్థానం సంపాదించింది. జపాన్, ఆసియా దేశాలు, అమెరికా, యూరప్ లలో ఈ బియ్యానికి డిమాండ్ బాగా ఉంది.


 
							 
							