మోదీ ఒడిలో కూర్చున్న దేవాన్ష్
ఏపీ మంత్రి నారా లోకేష్‌ను ప్రధాని మోదీ అమరావతి రాజధాని పునఃనిర్మాణం సమయంలో ఢిల్లీకి కుటుంబసమేతంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్, తన భార్య బ్రాహ్మణి, కుమారుడు లోకేష్‌తో కలిసి ప్రధాని మోదీని ఢిల్లీలో కలుసుకున్నారు. వారి సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ లోకేష్ కుమారుడు దేవాన్ష్‌ను మోదీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వం అందిస్తున్న మంచి పరిపాలన గురించి మంత్రి లోకేష్ మోదీకి తెలియజేశారు. అమరావతితో సహా వివిధ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీకి సంబంధించిన ఇతర అంశాలను ఆయన వివరించారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను టేబుల్ బుక్‌లో పొందుపరిచారు. యువగళం పాదయాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు తిరిగి అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు.

