Andhra PradeshHome Page Slider

దమ్ముంటే చిలకలూరిపేటలో పోటీ చెయ్ : మంత్రి విడదల రజినికి మల్లెల రాజేష్ నాయుడు సవాల్

పేట సీట్ కోసం ఆరున్నర కోట్ల మంత్రి రజినికి ఇచ్చా..!
సంచలనం సృష్టిస్తున్న చిలకలూరిపేట వైసీపీ ఇంఛార్జ్ కామెంట్స్

చిలకలూరిపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మంత్రి విడదల రజినిపై తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాన్ని విడదల సర్వనాశనం చేశారని ఆయన దుయ్యబట్టారు. ఇక్కడ మంత్రిగా పనిచేసి…. గుంటూరు వెళ్లి పోటీ చేయడం కాదని.. దమ్ముంటే పేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. మల్లెల కార్యాలయం ఇవాళ ఉత్రికత చోటుచేసుకుంది. నియోజకవర్గంలో సమన్వయకర్తను మార్చుతున్నారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో… ఆయన మద్దతుదారులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకోవడంతో అలజడి రేగింది. మొత్తం వ్యవహారానికి కారణం మంత్రి విడదల రజిని అంటూ రాజేష్ నాయుడు దుయ్యబట్టారు.

చిలకలూరిపేట నుంచి గుంటూరుకు వెళ్లి ఇక్కడ రాజకీయాలను శాసిస్తాననడం మానుకోవాలని రజినికి హితవుపలికారు. 2019 ఎన్నికల్లో కార్యకర్తలందరికీ న్యాయం జరుగుతుందని తామందరం సమష్టిగా పనిచేశామన్నారు. మర్రి రాజశేఖర్ మంత్రి అవుతారన్న ఉద్దేశంతో నాయకులందరూ కష్టపడి… విడదల రజినీ కోసం పనిచేశారని అందుకు కృతజ్ఞతకు బదులు కేసులు మోపి జైలుకు పంపారన్నారు. మర్రి రాజశేఖర్ లాంటి నాయకుడు మంత్రిగా వస్తే… నియోజకవర్గం బాగుపడుతుందని ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పనిచేస్తే… ప్రతిఫలంగా కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. నాలుగు తరాలుగా నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా బతుకుతున్నామని… ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితులు అలా లేకుండా చేశారని ధ్వజమెత్తారు.

పేట టికెట్… తనకు కాకుండా వేరే ఎవరికైనా ఇస్తానంటే ఊరుకోనన్నారు. ఒకవేళ, తనకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్‌కు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. మర్రి రాజశేఖర్‌కు అవకాశమిస్తే… 20 కోట్లు ఖర్చు చేసైనా గెలిపిస్తామన్నారు. రజిని ఆగడాల విషయంలో, సీఎం ఆఫీసు నుంచి ఫోన్ చేసినా భయపడేది లేదన్నారు. రజిని ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి… టీడీపీ నేతలను, కార్యకర్తలను వదిలేసి… వైసీపీ కార్యకర్తలపై, మర్రి రాజశేఖర్ అనుచరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. చిలకలూరిపేట వైఎస్ చైర్మన్‌కు రెండున్నర కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. సాక్షాత్తూ తనకు ఆరున్నర కోట్లివ్వాలని మల్లెల రాజేష్ నాయుడు చెప్పారు. డబ్బుల విషయమై… సజ్జలను అడిగితే.. ఆ అమ్మాయి ఇస్తుందిలే అన్నారని.. ఇదేం పద్ధతని ఆయన మండిపడ్డారు. విజయవాడ, గుంటూరు నుంచి ఎవరినో, చిలకలూరిపేటకు తీసుకొస్తే.. తాము ఊరుకోమని… చిలకలూరిపేట స్థానికులకే టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

మల్లెల రాజేష్ నాయుడు వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: