కర్ణాటకలో కాంగ్రెస్ రాక్..ప్రత్యర్థులు షాక్
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠకు తెరలేపుతూ..కాంగ్రెస్ పార్టీ విజయం వైపు రాకెట్‌లా దూసుకెళ్తుంది. దీంతో కర్ణాటకలోని బీజేపీ,జేడీఎస్ శ్రేణులు షాక్‌లో ఉన్నాయి. అయితే కర్ణాటకలో కింగ్ మేకర్ అని చెప్పుకునే జేడీఎస్ ఫలితాల్లో వెనుకబడింది. కాగా ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి 121 స్థానాల్లో గెలుపొందింది. మరోవైపు బీజేపీ పార్టీ 71 స్థానాలు,జేడీఎస్ 25 స్థానాలు,ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ఫలితాల్లో కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్ వైవు మొగ్గుచూపినట్లు వెల్లడైంది. అదే విధంగా అర్బన్ ప్రాంతాల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ మధ్యహ్నం లోగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫలితాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీయే ముందంజలో కొనసాగుతుండడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి,స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాయి.

