Home Page SliderNational

మళ్లీ కరోనా వైరస్ విజృంభణ

◆ అమెరికా, బ్రెజిల్, జపాన్, చైనాలో పెరుగుతున్న కేసులు
◆ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
◆ నేడు ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి మాండవీయ సమీక్ష

ప్రపంచవ్యాప్తంగా మరల కోవిడ్ భయాలు మొదలయ్యాయి చైనా నుంచి భయానక కథనాలు వస్తుండటం అమెరికా ,జపాన్, బ్రెజిల్, కొరియా తదితర దేశాల్లో కొత్త కేసులు గణనీయంగా పెరగటం ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో భారత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రోజువారి వైరస్ పాజిటివ్ నమూనాలను జీనం సిక్సేన్స్ంగ్ పరీక్షలకు పంపాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతలను కోరింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. జీనోమ్ టెస్టుల ద్వారా కొత్త వేరీయంట్లను సకాలంలో గుర్తించటం వీలవుతుందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో వారానికి 1200 కేసులు, ప్రపంచంలో 35 లక్షల కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. భారతదేశంలో మంగళవారం ఒక్కరోజు 112 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం యాక్టివ్ కేసులు 3490 గా ఉన్నాయి. కొన్ని దేశాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్లోనూ అప్రమత్తత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు ఈ ఏడాది జూన్ లో కరోనా కట్టడికి జారీ చేసిన మార్గదర్శకాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టటానికి వీలుగా అనుమానితులను ముందుగానే గుర్తించి ఐసోలేట్ చేయటం అత్యంత ఆవశ్యమని సూచించారు. తాజా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియ నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు, వైద్య రంగ నిపుణులు హాజరవుతారని సమాచారం.