చేవెళ్ల బస్సు ప్రమాదం: కంకరే మరణాలకు ప్రధాన కారణం
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలంలో జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కు చేరింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి కంకరే ప్రధాన కారణంగా నిలిచింది.
వివరాల ప్రకారం, అధిక వేగంతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. ఢీ కొనడంతో టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సులో కుడి వైపున కూర్చున్న ప్రయాణికులపై పడి వారిని గాయపరిచింది. కొందరు ప్రయాణికులు కంకర కింద చిక్కుకుని ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
బస్సులో ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణం చేస్తుండగా, ప్రమాద స్థలంలో మృతదేహాలను వెలికి తీయడానికి రక్షణ సిబ్బంది కృషి చేస్తున్నారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

