Andhra PradeshHome Page Slider

చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

టీడీపీ అధినేత చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజమండ్రి జైలు అధికారులు ఏసీబీ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు రిమాండ్‌ను న్యాయమూర్తి పొడిగించారు. 24 వరకు చంద్రబాబు రిమాండ్‌లో ఉంటారు. అంటే ఎల్లుండి వరకు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉండాల్సి వస్తోందని న్యాయమూర్తి చంద్రబాబుకు చెప్పారు. ఈ సందర్భంగా రిమాండ్‌లో ఇబ్బందులేమైనా ఎదురయ్యాయా అంటూ న్యాయమూర్తి చంద్రబాబును ప్రశ్నించారు. రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు చెప్పారు. తన అరెస్ట్ అక్రమంగా జరిగిందన్నారు. చేయని తప్పు చేశానని చెబుతున్నారు. అరెస్ట్ చేసిన తీరు కూడా సరిగాలేదని న్యాయమూర్తికి చంద్రబాబు చెప్పారు.