ఈ విషయంలో చంద్రబాబుదే రికార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట రూ.36 కోట్ల ఆస్తులున్నాయి. వీటిలో హెరిటేజ్ షేర్లు కూడా కలిసి ఉన్నాయి. ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ. 931 కోట్లు కాగా, అప్పులు రూ.10 కోట్లు. వీటిలో ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట రూ.895 కోట్లు ఆస్తులున్నాయి. రెండవ స్థానంలో అరుణాచల్ ముఖ్యమంత్రి పెమాఖండూ రూ.332 కోట్ల ఆస్తి, రూ.180 కోట్ల అప్పులతో ఉన్నారు. అందరికన్నా తక్కువగా రూ. 15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చివరిస్థానంలో ఉన్నారు.

