విశాఖ ప్రజలను చంద్రబాబు, పవన్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : సజ్జల
ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కావాలని విశాఖపట్నంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, విశాఖ రాజధానిగా వైఎస్ జగన్ ప్రభుత్వం అక్కడకు వెళ్లబోతున్నారని తెలిసినప్పటి నుంచి అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఏవో ఘోరాలు జరగబోతున్నాయని ప్రచారం చేస్తున్నారన్నారు. విశాఖపట్నానికి వెళ్లి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న విధానం చూస్తే విశాఖకు రాజధాని రాకూడదనేది వారి కోరిక అన్న విషయం అర్థం అవుతుందన్నారు. అక్కడ ప్రజలను టెర్రరైజ్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ప్రతిరోజు గుట్టలు కొండలు దగ్గరికి వెళ్తూ అక్కడేదో జరిగిందని యాగి చేస్తున్నాడని ఇసుక దిబ్బల దగ్గరికి వెళ్లి ప్రపంచంలోనే పర్యావరణ రక్షణ అంత తాను చేస్తున్నట్లు ఫోజులిస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ ఆలోచన అని అన్నారు. చంద్రబాబు హయాంలోనే సరైన పరిపాలన లా అండ్ ఆర్డర్ లేవన్నారు.