Andhra PradeshHome Page Slider

పోలీసుల హైఅలర్ట్ నడుమ గుడివాడకు చంద్రబాబు

మాజీ సీఎం చంద్రబాబు దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ రోజు గుడివాడలో పర్యటించనున్నారు. అయితే గుడివాడలో ఈ రోజు టీడపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు గుడివాడకు రానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. దీంతో గుడివాడలో ఇవాళ ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరయ్యేలా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.  చంద్రబాబు ,లోకేశ్‌లపై తీవ్రస్థాయిలో మండిపడే మంత్రి కొడాలి నాని నియోజకవర్గం కావడంతో పోలీసులు ఇక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీ,టీడీపీ మధ్య గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా పోలీసులు చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లకు భారీ భద్రత కల్పించనున్నారు.