ఏపీలో వైసీపీ పార్టీకి బిగ్ షాక్
ఏపీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాగా విశాఖ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఆయన వైసీపీకి గుడ్‌బై కూడా చెప్పారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిగా ఎన్నో సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా వీలు కాలేదన్నారు. దిగువ స్థాయిలో సమస్యలు తీర్చలేనప్పుడు పదవిలో ఉండి లాభం లేదని తెలిపారు. అయితే గతకొంతకాలంగా రమేశ్‌బాబు అధిష్టానం, పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లా అధ్యక్ష పదవితోపాటు వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.