అమరావతిలో భారీ విగ్రహానికి ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా తెలుగు ప్రజలకు గొప్ప బహుమతి ఇవ్వాలని ఆలోచనతో భారీ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు ప్రజల ప్రియతమ నాయకుడు, దిగ్గజ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని నీరుకొండ గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రాష్ట్ర సాంస్కృతిక విలువలు, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ విగ్రహం 195 అడుగుల ఎత్తు ఉండనుంది.

