Andhra PradeshHome Page Slider

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో రిమాండ్ చెల్లదని చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఐతే చంద్రబాబు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టులో విచారణ తర్వాత చంద్రబాబుకు న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూద్రా వాదనలు విన్పించగా, సీఐడీ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా చంద్రబాబు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన వాదనను తోసిపుచ్చిన హైకోర్టు, సెక్షన్ 17ఏ కింద చేసిన అరెస్టు చెల్లదన్న వాదనను అంగీకరించలేదు. సీఐడీ సమర్పించిన వాదనలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏకీభవించింది. అరెస్టు సరైనదేనని, రిమాండ్ సరైనదని, కేసును తదనుగుణంగా దర్యాప్తు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌ను హైకోర్టు క్లియర్ చేయడంతో మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. పోలీసులకు ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించే అవకాశం ఉంది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించే అవకాశం ఉంది.