Andhra PradeshHome Page Slider

ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలపై క్లారిటీ రాబోతోందా!?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇచ్చే అంశాలపై ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒకే దేశం ఒకే ఓటు జమిలి, ముందస్తు ఎన్నికలతో పాటు, మహిళా యుసిసి బిల్లులను కేంద్రం ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో యుసిసి మినహా జమిలి మహిళా బిల్లులకు అంశాల వారీగా మద్దతు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నెల రెండో తేదీన కుటుంబ సమేతంగా యూకే పర్యటనకు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ సోమవారం అర్ధరాత్రి తాడేపల్లి తన నివాసానికి చేరుకున్నారు.

చంద్రబాబు అరెస్టు రాజకీయ పరిణామాల నేపథ్యంలో వెంటనే ఢిల్లీ టూర్ ఖరారు అవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కాగా జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జగన్ కు ఒక క్లారిటీ ఉందని ఈ నేపద్యంలో ముందస్తు సంకేతాలను ఎమ్మెల్యేలు కూడా తెలిపారని ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వచ్చిన సన్నద్ధంగా ఉండాలని సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ అనంతర పరిణామాలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరిగే భేటీల ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే నేడు శాంతి భద్రతల అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. తాను యూకే పర్యటనలో ఉన్న సమయంలోనే చంద్రబాబు అరెస్ట్ కావటంతో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిని మోడీ, అమిత్ షాలకు వివరించడంతోపాటు రాజధాని అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల వ్యవహారం పై సిబిఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా కూడా కేంద్రాన్ని కోరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయస్థాయిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకరిద్దరు నేతల మినహా మిగిలిన పార్టీలు స్పందించని అంశాలను ప్రధాని మోడీ అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా అరెస్టు నిరసిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన బంధు విఫలం కావడం జనాదరణ కరువైన విషయాలు తో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని వారికి జగన్ వివరించనన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని కోలలకోలేని దెబ్బతీసిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయని విషయంపై కూడా పార్టీ నేతలతో జరిగే సమావేశంలో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.