జమ్ము కాశ్మీర్‌కు మరో అరుదైన ‘రికార్డ్’
‘భూతల స్వర్గమైన కాశ్మీర్ లోయ’ ప్రకృతి అందాలకు నెలవు. ఇప్పుడు కాశ్మీర్‌కు మరో రికార్డు దక్కింది. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌గా రికార్డులకెక్కింది శ్రీనగర్‌లోని ఈ తులిప్ గార్డెన్. ఈ సీజన్‌లో ఏర్పాటు చేసే తులిప్ ఫెస్టివల్‌ను చూడడానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తూంటారు. ఈ గార్డెన్ దాదాపు 70 రకాల తులిప్ మొక్కలతో , 16 లక్షలకు పైగా పుష్పాలతో కనువిందు చేస్తోంది. ఇవి లిల్లీ జాతికి చెందినవి. పర్యాటకులను ఆకట్టుకొనేందుకు వాటర్ ఫౌంటెన్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. కొవిడ్ అనంతరం ఏటా రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారు. దీనిని ఈ మధ్యనే కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సింహా ప్రారంభించారు. దీనివల్ల పర్వత ప్రాంతాలలో గిరిజనులకు ఈ ఫెస్టివల్ సందర్భంగా ఉపాధి ఏర్పడుతుంది. ఏప్రిల్ 3 నుండి 20 రోజుల పాటు ఈ తులిప్ ఫెస్ట్ జరుగబోతోంది.

