అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలో నిత్యం ఎక్కడో ఓ చోట కాల్పుల జరుగుతూనే ఉన్నాయి. అమెరికా పౌరులకు గన్ లైసెన్స్ ఉండటం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయ్. తాజాగా టెన్నెస్సీ మెంఫిస్ అనే 19ఏళ్ళ యువకుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ యువకుడు జరిపిన కాల్పుల్లో అక్కడిక్కడే ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

