7వ రోజు కూడా స్ట్రైక్ చేస్తున్న అంగన్‌వాడీలు
ఏపీ వ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళనలు 7వ రోజు కొనసాగుతున్నాయి. గుంటూరు, కడప, విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం సహా చాలాచోట్ల తమ సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, పెన్షన్ అమలుపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. తమ విధులను సచివాలయ సిబ్బందితో చేయిస్తే ఎలా అంటూ, తమకు వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం కుంటి సాకులతో వేరే ఉద్యోగులతో పనులు చేయిస్తే తమ ఆదాయ మార్గాలు దెబ్బతింటాయని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను తీర్చాలని, తమ ప్యామిలీలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరిన అంగన్‌వాడీ కార్యకర్తలు.

