అమూల్ ఎండీ ఆర్‌ఎస్ సోథి తొలగింపు.. జయెన్ మెహతాకు బాధ్యతలు
గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ బోర్డు అమూల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆర్‌ఎస్ సోథిని పదవి నుంచి తప్పించింది. ఈ మేరకు ఫెడరేషన్ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ఎండీగా జయన్ మెహతాను నియమించారు. సోథి కార్యాలయాన్ని సైతం సీల్ చేశారు. పదవి నుంచి తప్పించడానికి కారణమేంటన్నది తెలియలేదు. సోథి 40 ఏళ్ల క్రితం సేల్స్‌మెన్‌గా జీసీఎంఎంఎఫ్‌లో చేరారు. గత రెండేళ్లుగా ఆయన ఎక్స్‌టెన్షన్‌లో ఉన్నారు. ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2010 నుంచి అమూల్ ఎండీగా సోథి వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల్లో పూర్థి స్థాయి ఎండీని ప్రకటించనున్నట్లు సమాచారం.

