లిక్కర్, పాన్ ప్రమోషన్లకు అల్లు అర్జున్ “నో” చెప్పారట
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. పుష్ప-2లో హీరో మద్యం సేవించినప్పుడు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని కొన్ని లిక్కర్, పాన్ కంపెనీలు బన్నీని కోరాయట. అందుకోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశాయట. అయితే, వాటిని పుష్పరాజ్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. వాటిని ప్రమోట్ చేయకపోవడం వలన సమాజం పాడవకుండా ఉంటుంది అని భావించి, తన అభిమానులను మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు గురికాకుండా దూరం చేయాలని, అందుకే ఈ యాడ్‌లకు నేను యాక్ట్ చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పారట.

