‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే’..కేటీఆర్ ఫైర్
‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నరకోట్ల ఖర్చు ఎందుకు’? అంటూ ఫైరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ మంత్రులకు నోటికి అడ్డు అదుపు లేకపోయిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఈ విషయం పోస్టు చేశారు. ‘మీ మంత్రులను మెంటల్ హెల్త్ రిహాబిలేషన్ స్పెషలిస్ట్ వద్దకు పంపించండి’ అని రాహుల్ గాంధీకి సూచించారు. నాన్సెన్స్ పాలిటిక్స్ చేసినందుకు మీ మంత్రులకు లీగల్ నోటీసులు పంపిస్తున్నానంటూ ఫోటోను షేర్ చేశారు. మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై, నాగార్జున కుటుంబంపై, సమంతా, నాగచైతన్యల విడాకుల వ్యవహారంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను అనుకోకుండా అలా అన్నానని క్షమాపణలు చెప్పారు. కానీ కేటీఆర్‌పై మాత్రం తగ్గేది లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు.


 
							 
							