కుంగిన రహదారి.. గుంతలో కారు..
భారీ వర్షాలతో రహదారి అకస్మాత్తుగా కుంగడంతో ఓ కారు గుంతలో బోల్తా పడింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై తిరువాన్మియూర్ టైటిల్ పార్క్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది. కారులోని ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. వారికి స్వల్ప గాయాలవడంతో చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ విచారణ చేపట్టింది.

