ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్.. సామ్ కరణ్ 18.50 కోట్లు
ఇంగ్లాండ్ ప్లేయర్ సామ్ కరణ్ ఐపీఎల్ వేలంలో రికార్డ్ సృష్టించాడు. ఈ ఆటగాడిని 18.50 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. 2వ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబయి ఇండియన్స్ 17.50 కోట్ల కు సొంతం చేసుకొంది. 3వ స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ 16.25 కోట్లతో చెన్నై దక్కించుకుంది. వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ 16 కోట్లతో లక్నో సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను వేలంలో 13.25 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. మయాంక్ అగర్వాల్‌ను హైదరాబాద్ 8.25 కోట్లకు దక్కించుకుంది. శివమ్ మావి 6 కోట్లు (గుజరాత్), జాసన్ హోల్డర్‌ను రాజస్థాన్ 5.75 కోట్లకు సొంతం చేసుకుంది. ముకేశ్‌కుమార్ 5.5 కోట్లు (ఢిల్లీ), హెన్రిచ్ క్లాసెస్ 5.25కోట్లు (హైదరాబాద్), జాక్స్ 3.2 కోట్లు (బెంగళూరు), విష్రంత్ శర్మ 2.6 కోట్లు (హైదరాబాద్) మనీశ్‌పాండే 2.4 కోట్లు (డిల్లీ), న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 2 కోట్లు (గుజరాత్), ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 2 కోట్లు (హైదరాబాద్), ఫిల్ సాల్ట్ 2 కోట్లు (ఢిల్లీ), రీస్ టోప్లే 1.9 కోట్లు (బెంగళూరు), ఆస్ట్రేలియా ఆటగాడు రిచర్డ్సన్ 1.5 కోట్లు (ముంబై), కేఎస్ భరత్ 1.2 కోట్లు (గుజరాత్), నిషాంత్ సింధు 60 లక్షలు (చెన్నై), వైభవ్ అరోరా 60 లక్షలు (కోల్‌కతా), జయ్‌దేవ్ ఉనద్కత్ 50 లక్షలు (లక్‌నవ్), ఇషాంత్ శర్మ 50 లక్షలు (ఢిల్లీ), సికిందర్ రజా 50 లక్షలు (పంజాబ్), ఓడియన్ స్మిత్ 50 లక్షలు (గుజరాత్), యశ్ ఠాకూర్ 45 లక్షలు (లక్‌నవ్), షేక్ రషీద్ 20 లక్షలు (చెన్నై), సన్విర్ సింగ్ 20 లక్షలు (హైదరాబాద్), సమర్థ్ వ్యాస్ 20 లక్షలు (హైదరాబాద్).

