ChatGPT తో లక్షలు కొల్లగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు
ప్రపంచంలో మొన్నటివరకు గూగుల్‌కు పోటి ఇచ్చే మరో యాప్ లేదనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే మార్కెట్‌లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ChatGPT అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచే ఇది గూగుల్‌కి గుబులు పుట్టిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా దీని వినియోగం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ ChatGPTని ఎలా వినియోగించాలి అనే దానిపై చాలామందికి అవగాహన లేదు. దీంతో కొందరు ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన లాన్స్ జంక్ అనే 23 ఏళ్ల కుర్రాడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని లక్షలు సంపాదిస్తున్నాడు. అది ఎలా అంటే ఇతను ChatGPT వినియోగం గురించి ఆన్‌లైన్ కోర్స్ ప్రారంభించాడు. గత మూడు నెలల్లో దాదాపు 15వేల మంది స్టూడెంట్స్ ఈ కోర్స్ లో జాయిన్ అయ్యారు. దాంతో అతను ఈ మూడు నెలల్లోనే రూ.28.69 లక్షలు సంపాదించాడు. కాగా ఇతని ఐడియాకు అందరు ఫిదా అవుతున్నారు.