Home Page SliderNationalSports

ఛాంపియ‌న్స్‌గా నిలవాలంటే …అంత ఆషామాషీ కాదు!

ఛాలెంజింగ్ అనే కంటే…అదృష్టం మీదే ఆధార ప‌డే క్రీడ ఏదైనా ఉందంటే అది ముమ్మాటికీ క్రికెట్టే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.లీగుల్లో ఆడే ఆట‌గాడు సిరీసుల్లో చ‌తికిల‌ప‌డ‌తాడు.సిరీసుల్లో స‌త్తా చాటే వాడు…ట్రోఫీల్లో చేతులెత్తేస్తుంటాడు. అలాంటి వారి కార‌ణంగా…ఒక జ‌ట్టు లీగులు,గ్రూపులు ద‌శ‌లు దాటి చివ‌ర‌కు ఫైనల్ చేరినా ఒక్కోసారి కాదు…ఎన్నో సార్లు ఫైన‌ల్ వాకిట్లో బోల్తా ప‌డుతుంటుంది.అంత మాత్రాన వారిలో స‌త్తాలేద‌నుకుంటే పొర‌పాటే అవుతుంది.ఈ విష‌యంలో టీం ఇండియా మిన‌హాయింపేమీ కాదు.ఒత్తిడిని అధిగ‌మించి ట్రోఫీని సాధించాలంటే టీమిండియాకు ముచ్చెమ‌ట‌లు ప‌డుతుంటాయ‌ని చ‌రిత్ర చెబుతున్న మాట‌.ఫైన‌ల్ ఫోబియా అనే ప‌దం కూడా బాగా వాడుక‌లోకి వ‌చ్చిందంటే…అది టీమిండియా పుణ్యానే అని చెప్ప‌క త‌ప్ప‌దు.ఫైన‌ల్లో ఏ జ‌ట్టు అయినా ఎదుటి జ‌ట్టుని జ‌యించాలంటే ముందు ఒత్తిడిని జ‌యించాలి.దాన్ని జ‌యించ‌లేనప్పుడు ట్రోఫీ మీద ఆశ‌లు వ‌దిలేసుకోక త‌ప్ప‌దు. ఈ నెల 9న ఛాంపియ‌న్స్ ట్రోఫీ పైన‌ల్ వార్ …దుబాయి వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.ఈ ట్రోఫీలో భాగంగా గ్రూపు ద‌శ‌ల్లో జ‌రిగిన మ్య‌చుల్లో… ఇప్ప‌టికే దుబాయ్‌లో టాస్ గెలిచిన నాలుగు టీంలు పరాజ‌యం పాల‌య్యాయి. బంగ్లాదేశ్‌,పాకిస్తాన్‌,న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియా ఈ నాలుగు జ‌ట్లు… గ్రూప్ ద‌శ‌లో,సెమీఫైన‌ల్ ద‌శ‌లో టాస్ గెలిచి మ్యాచ్‌ల‌ను ఓడాయి. రేపు కూడా టాస్ కీల‌కం కానుంది.దుబాయ్‌లో టాస్ గెలిచిన టీంలకు విజ‌యావ‌కాశాలు….98శాతం మేర ఉండ‌టం లేదు. ఇది దుబాయ్ గ్రౌండ్ చెబుతున్న‌ రికార్డ్స్ .2000లో కెన్యా వేదిక‌గా జ‌రిగిన 2వ ఛాంపియ్స్ ట్రోఫీలో ఫైన‌ల్‌కి చేరిన న్యూజిలాండ్‌,భార‌త్ జ‌ట్లు హోరా హోరీగా త‌ల‌ప‌డ్డాయి.ఛేజింగ్‌లో ఒకే ఒక్క ర‌న్ తేడాతో భార‌త్ ఓడింది.తిరిగి పాతికేళ్ల త‌ర్వాత ఇవే జ‌ట్లు ” ఛాంపియ‌న్స్ ఆఫ్ ఛాంపియ‌న్ ” కోసం త‌ల‌ప‌డుతున్నాయి. దుబాయ్‌లో న్యూజిలాండ్ ,భార‌త్ జ‌ట్లు రెండో వ‌న్డే ఆడ‌బోతున్నాయి. గ్రూప్ స్టేజిలో 12వ మ్యాచ్ ఆడిన ఫైన‌ల్ జ‌ట్లలో న్యూజిలాండ్ టాస్ గెలిచి మ్యాచ్ ఓడింది.ఈ మ్యాచ్‌లో కివీని చిత్తుగా ఓడించింది టీమిండియా .అయితే లాహోర్ లో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో అత్య‌ధిక స్కోర్ చేసి మంచి ఊపుమీదున్న కివీస్‌ని కంట్రోల్ చేయాలంటే టీం ఇండియాకి మంచి బౌలింగ్ లైన‌ప్ ఉండాలి. అంత‌కు మించి ఫైన‌ల్ ఫోబియాను అధిగ‌మించాలి.ఏ మాత్రం అంచనాలు లేకుండా ఫైన‌ల్ కి చేరుకున్న జ‌ట్టుతో….ప‌క్కా అంచ‌నాలతోనే ఫైన‌ల్‌కి వ‌చ్చిన టీం ట్రోఫీని గెల‌వాలంటే క‌చ్ఛితంగా ఎమోష‌న్ ఫ్రీ జోన్‌లో నే ఉండాలి. భార‌త్ జ‌ట్టుకు ఫైన‌ల్ అనేది ఒక ఎమోష‌న్‌…కానీ కివీ టీంకి ఎలాంటి ఎమోష‌న్ లేదు. వాళ్లు యూఏఈ మీద ఓడిపోతుంటారు….బంగ్లాదేశ్ మీదా ఓడిపోతుంటారు.ఇలాంటి త‌రుణంలో బార‌త్ ట్రోఫీ గెల‌వాంటే ముందు ఎమోష‌న్‌,ప్రెజ‌ర్‌ని గెల‌వాలి.