Home Page SliderInternationalPolitics

‘అనుమానాలొద్దు అడుగు ముందుకువేద్దాం’..చైనా

చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్త్రీ నేడు బీజింగ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్యా అనుమానాలు వీడి, అడుగు ముందుకేద్దాం అని వ్యాఖ్యానించారు. పరస్పర అనుమాన దృష్టితో దూరంగా ఉండి ప్రయోజనం లేదన్నారు. గతేడాది భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన సమావేశం తర్వాత ఇరు దేశాల సంబంధాల విషయంలో మంచి మార్పులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలు ఆధారంగా సంబంధాలు నెరుపుకోవాలని వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి నాలుగేళ్లుగా కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ గత ఏడాది జరిగిన ఒప్పందంలో ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చని రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్త్రీ బీజింగ్‌లో పలు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.