Home Page SliderInternationalSports

బుమ్రాకు అరుదైన గౌరవం..

ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమ్ ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ఆడిన ఆటల్లో బుమ్రా అన్ని మ్యాచ్‌లలోనూ అదరగొట్టాడు. మొత్తంగా 84 వికెట్లతో అత్యున్నతంగా నిలిచాడు. రెండవ స్థానంలో ఉన్న హసరంగ కేవలం 64 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతీ ఏడాది టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఏడాది బుమ్రాను ‘టీమ్ ఆప్‌ది ఇయర్‌’కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. భారత్ యువ బ్యాటర్‌ యశస్వీ జైస్వాల్‌కు కూడా చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇప్పటి వరకూ 30 వికెట్లు పడగొట్టాడు.